అమరావతి: మే,15(తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల ఏర్పాట్ల గురించి నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గుమ్మడి నాయకర్ శుక్రవారం
అమరావతి సచివాలయంలో పుష్కరాల ప్రత్యేక అధికారి ఐఏఎస్ జి. వీరపాండియన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు అంశాలపై వీరిరువురు విస్తృతంగా చర్చించారు.
పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో, వారికి మెరుగైన సౌకర్యాలు అందించేలా ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నరసాపురం ప్రాంత అభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యతగా తీసుకుని తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు.
పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక అధికారిని కలిసిన ఎమ్మెల్యే నాయకర్.
పుష్కరాల ప్రత్యేక అధికారులు కలిసిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్