ఆత్రేయపురం: మే,15(తెలుగు న్యూస్ పవర్.కామ్)
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. రుడా ఈ నిధులు సమకూర్చింది. నిధులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలం నుంచి స్వామివారి ఆలయం వరకు తారు రోడ్డు వేస్తారు. కాంక్రీట్ బేస్ నిర్మాణం, ఆలయం నుంచి ఏటిగట్టు వరకు తారు రోడ్డు వేయటానికి ప్రతిపాదించారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ సమస్య, త్వరలో తీరనుంది. దేవాలయం అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన దశ ప్రారంభమైందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం ఐఅందించి, నిధుల మంజూరుకు కృషి చేసిన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనందరావు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరలోనే ఈ పనులను ప్రారంభించి, అత్యంత వేగంగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి, మౌలిక వసతుల మెరుగుదలకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
కోనసీమ తిరుమలకు కోటి నిధులు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం