Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.

శ్రీ మావుళ్ళమ్మ వారి సన్నిధిలో ఎమ్మెల్యే దంపతులు
అమ్మవారి కానుకలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే దంపతులు

భీమవరం: మే, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం తో సత్కరించగా, ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ఆలయ ధరకర్తలు వుదీసి మీనాక్షి, గుసిడి జానకి నాగ శిరీష, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గొంతిన రమణ, పాపొలు ఏడుకొండలు ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు ఎమ్మెల్యేను అభిమానంతో కలుసుకున్నారు.