Telugu News Power

ఎఫ్ ఎల్ ఎన్ వారం రోజుల శిక్షణ ప్రారంభం.

ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈఓ లు

పాలకొల్లు: జూన్,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య, ఎఫ్ ఎల్ ఎన్ వారం రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమయ్యింది. స్థానిక లంకలకోడేరు ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణా కార్యక్రమం ఈనెల 9 వరకు జరుగుతుంది. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, చంద్రశేఖర్ మాట్లాడుతూ, విచారణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ఈ అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తరగతి గదిలో ఆటపాటలతో విద్యార్థులకు బోధన జరపాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 200 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు గంగాధర్ శర్మ, గుమ్మళ్ళ వీరాస్వామి, ఆకుల శ్రీవాణి, రామకృష్ణంరాజు, ప్రధానోపాధ్యాయులు ఎంకే రాజశేఖర్, రిసోర్స్ పర్సన్ లు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.