Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు లక్ష రూపాయల బంగారు నిధికి విరాళం.

శ్రీ మావుళ్ళమ్మకు విరాళం అందజేస్తున్న సోము దంపతులు.

భీమవరం: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి పెన్నాడకి చెందిన సోము వీర వెంకట సత్యనారాయణ, వెంకట దుర్గా నాగలక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారికి సుమారు లక్ష వేయి నూట పదహారు రూపాయలు విలువ చేసే 6.650 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ పాపొలు ఏడుకొండలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేసారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచజేసారు.