Skip to main content

Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో పర్యావరణ దినోత్సవం.

కళాశాల ఆవరణలో మొక్కలు నాటుతున్న దృశ్యం

పాలకొల్లు: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, వద్ద శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్–I, యూనిట్–II , ఈకో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కడలి రత్న మాణిక్యం ప్రారంభించారు. కళాశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. చెట్లు ప్రకృతికి ప్రాణాధారమని, వాతావరణ సమతుల్యతను కాపాడటంలో వాటి పాత్ర ఎంతో కీలకమని వివరించారు.అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు, ఈకో క్లబ్ సమన్వయకర్తలు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.