Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు కాసు బంగారం కానుక.

భీమవరం: జూన్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్).పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ముప్పిరిశెట్టి నాగరాజు, జయశ్రీ దంపతులు కుమారుడు రోహన్ జన్మ దినోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారికి 8 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం అందజేశారు. ధర్మకర్తలు వుదిశి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్, గొంతెన రమణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందచేసారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.