భీమవరం: జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానము వద్ద ఈనెల 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవము నిర్వహిస్తారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్ శనివారం తెలిపారు. ప్రభుత్వం, దేవదాయ శాఖ ఆదేశముల మేరకు యోగ శిక్షణ తరగతులు ఈనెల 8 నుంచి 21 వరకు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న ఉన్నవారు దేవస్థానం కౌంటర్ వద్ద నమోదు చేసుకోవాలని కోరారు. ప్రముఖ యోగ గురువు, సుదర్శన క్రియ యోగం లో నిష్ణాతులైన కలిగొట్ల గోపాల శర్మ ఆధ్వర్యములో ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకొన్న వారికీ చివరి రోజున శిక్షణ ధ్రువపత్రాలు ఇస్తారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. ఈ యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఆరోగ్యాన్ని,ఆనందాన్ని పొందాలని దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పిలుపునిచ్చారు.