Telugu News Power

చవాకుల చారిటబుల్ ట్రస్ట్ కు అవార్డు.

పాలకొల్లు: జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పర్యావరణ దినోత్సవం సందర్భంగా, హైదరాబాదులోని తెలుగు వర్సిటీ, ఎన్టీఆర్ ఆడిటోరియంలోని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవ అవార్డుల కార్యక్రమం అత్యంత ఘనంగా శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో హర్యానా,
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ అత్యంత అవశ్యమని, ప్రకృతిని కాపాడుకునే పరిస్థితి ఆసన్నమైందని , ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మాజీ గవర్నర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ చవాకుల సూర్య నరేష్ బాబుకి పర్యావరణ మిత్ర నేషనల్ అవార్డు-2026 ను ఈ సభలో బండారు దత్తాత్రేయ అందజేసి, ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సినీనటి పూజిత జొన్నలగడ్డ, ఇండొ కెనడియన్ యూత్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆశ్రిత రోయ్యూరు, బిజెపి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యూరు శేషసాయి, పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్రెడ్డి, తెలంగాణ యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ కూన గోపాలకృష్ణ తుదితులు పాల్గొన్నారు.