Skip to main content

Telugu News Power

గాంధీ భగవాన్ రాజును అభినందించిన ఛాంబర్స్ కళాశాల బృందం.

కాష్మోక్లబ్ కార్యాలయంలో ఛాంబర్స్ కళాశాల ప్రతినిధుల బృందం గాంధీ భగవాన్ రాజు సత్కరిస్తున్న దృశ్యం

పాలకొల్లు: జూన్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా,ఛాంబర్స్ విద్యా సంస్థల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు, కార్యదర్శి కె.వి సీతారామరాజు మంగళవారం భగవాన్ రాజు కార్యాలయంలో కలిసి అభినందించారు.
వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు తీరి, మళ్లీ రొయ్యల రైతుల ఎగుమతులు పుంజుకునే రోజులు రావాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కటారి నాగేంద్ర కుమార్, ఛాంబర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావులు భగవాన్ రాజు అభినందించారు.