Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు రూ.61 లక్షల హుండీ ఆదాయం. బంగారం గ్రా 76.700లు, వెండి గ్రా315లు.

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు దృశ్యం

భీమవరం: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా ,భీమవరంపట్టణం లోని
ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు మంగళవారం తెరిచారు. హుండీ లెక్కింపు 75 రోజుల కాలపరిమితి. నగదు రూపంలో
రూ.61 లక్షల6వేల458లు భక్తులు సమర్పించారు. బంగారం 76.700 మిల్లీగ్రాములు, వెండీ 315 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీలో భక్తులు కానుకగా వేశారు. కాకినాడ పట్టణం ఎం.ఎస్.ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది.ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు,రామాయణం శ్రీనివాస్,ఉదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్,కారెంపూడి ఆదిలక్ష్మి, మిర్తిపాటి గుణేశ్వరరావు,గొంతెన రమణ,యండా సత్యవతి, దేవదాయ ధర్మదాయ శాఖ భీమవరం తనిఖీదారు సాయికుమారి, కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది
ఆలయ సిబ్బంది, రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలనుండి 180 మంది సేవకులు పాల్గొన్నారని, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.