Skip to main content

Telugu News Power

నేడే కొంతేరులో తొలి విడత అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ప్రారంభం

యలమంచిలి: జూన్,19 ( తెలుగు న్యూస్ పవర్ కామ్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు యలమంచిలి మండలం, కొంతేరు,యూత్ క్లబ్ కళామందిరంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం జలవనరుల శాఖ మాత్యులు డా. నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు.
అర్హత కలిగిన భూ యజమాన రైతు కుటుంబాలు, భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు ఈ ఆర్థిక సహాయం అందించబడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5,000 మరియు కేంద్ర ప్రభుత్వ నుంచి పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000, మొత్తం రూ.7,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని వెల్లడించారు.
స్థానిక నియోజకవర్గంలో అర్హత కలిగిన 14,458 మంది రైతులకు రూ.9.40 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ తెలిపారు.
రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.