Telugu News Power

పెద గోపురం వద్ద భక్తుల సప్త ప్రదక్షిణలు.

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మాడ వీధులలో శ్రీ స్వామి వారి సప్త సోమవారాల, ఏడు ప్రదక్షిణాలు ఏడు మారేడు దళములతో భక్తులు సుమారుగా 250 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ పి వాసు , ఆలయ ప్రధాన అర్చకుడు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి కిష్టప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి శ్రీ స్వామివార్లకు ధూప సేవ, పంచ హారతులు సేవ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.