పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బాలికల పాఠశాల వద్ద గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శేషాద్రి హాస్పిటల్ అధినేతలు, ప్రముఖ వైద్యులు గుణ్ణం నారాయణరావు, సుజయ శ్రీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం నిర్వహించారు. పురోహితులు శశికాంత్ (తణుకు), కృష్ణ చైతన్య తదితరులు స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. ఈ కళ్యాణోత్సవానికి పలువురు దంపతులు, భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ ఈవో పి వేణుగోపాలరావు కళ్యాణోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, కూటమి నాయకులు బోనం మునసబు, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, బిట్ట లక్ష్మీనారాయణ, వి గోపి, బిరుదుకోట శేఖర్, ఆలయ సిబ్బంది ఉన్నమట్ల సురేష్, చల్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవారి కల్యాణ వేడుకలు.
కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులు