భీమవరం: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ ఇలవేలుపు, తెలుగు ప్రజలు ఆరాధ్య దైవం,
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి అనుగ్రహం కటాక్షం ప్రతి పౌర్ణమి నాడు జరిపే చండీ హోమం దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఉదయం 7 గంటలకు నిర్వహిస్తారు. నాట్లు వేసుకునే వ్యవసాయం సమయం, ఆషాడ మాస ఆరంభాన్ని సూచించే జ్యేష్ట పౌర్ణమి సందర్బంగా ఏరువాక పున్నమి సందర్బంగా రైతు సోదర, సోదరీమణులకు, భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు ఆశీస్సులుతో వ్యవసాయ సమృద్ధి, పాడి పంటల వృద్ధి తో సుఖ శాంతులు, సిరి సంపదలు కలగాలని రైతాంగ కుటుంబాల సుఖసంతోషాల కోసం సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని అద్భుతమైన సంకల్పంతో నేటి ఉదయం 10 గంటలకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ ధాన్యలక్ష్మి పూజ, మహిళలు సౌభాగ్యం కొరకు శ్రీ సౌభాగ్యలక్ష్మి పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఈ ప్రత్యేక పూజల్లో రైతులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం ఆధ్వర్యంలో ధర్మకర్తలు తెలిపారు..
ఈ పూజల ప్రధాన సంకల్పాలు:
రైతాంగానికి సమృద్ధిగా వర్షాలు, మంచి పంటలు కలగాలని.
ధాన్య సమృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కోసం.
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని.
లోకక్షేమం, శాంతి, ప్రజల ఆయురారోగ్యాల కోసం, అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది.
ఏరువాక పున్నమి సందర్భంగా నిర్వహించబడే ఈ మహోత్సవంలో రైతులు, మహిళలు, యువత, భక్తజనులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి కృపాకటాక్షాలను పొందవలసిందిగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం విజ్ఞప్తి చేస్తుంది అని తెలిపారు..ఈ విశేష పూజలు అనంతరం రైతులకు తలా గుప్పెడు ధాన్యం ఇస్తారు. అవి పొలాలలో చల్లుకోవడం ద్వారా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు అని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
నేడే శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో చండీ హోమం. రైతులకు అమ్మవారు అనుగ్రహించిన విత్తనాల పంపిణీ.