పాలకొల్లు: జూలై,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత
4 రోజులుగా స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన శిబిరాన్ని గురువారం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు సముద్రాల నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దస్తావేజు లేక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం దిగివచ్చి నిజమైన దస్తావేజు లేఖల సంఘాలతో సంప్రదింపులు జరిపి వారి ఆమోదం తెలిపిన తర్వాతే నిరసన ముగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరితోనో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజి తో రాష్ట్ర నాయకులు జరిపిన చర్చలను తాము పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకటేశ్వరరావు, కడలి శ్రీనివాస్, కృత్తివేంటి రవి కాంత్, గోటేటి హనుమంతరావు, శ్రీనివాస్, డిటిపి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వం దిగివచ్చే వరకు పెన్ డౌన్ నిరసన ఆగదు. -ఉభయగోదావరి జిల్లాల లేఖర్ల అధ్యక్షుడు సముద్రాల స్పష్ఠీకరణ.