Skip to main content

Telugu News Power

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణ 26 రోజుల సాగిన నిరాహార దీక్ష

కేంద్ర మంత్రుల సమక్షంలో దీక్ష విరమించిన వాంగ్ చూక్

న్యూఢిల్లీ, జూలై 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)
సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 26 రోజులుగా కొనసాగించిన నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డా. జితేంద్ర సింగ్ సమక్షంలో గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించారు.
వాంగ్‌చుక్ తన ప్రకటనలో, దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని హామీలు లభించడంతో దీక్షను విరమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా సాగుతోందని, ఎలాంటి హింసకు తావివ్వవద్దని తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. కొన్ని “సామాజిక వ్యతిరేక శక్తులు” హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి శాంతియుత నిరసనకారులపై ప్రతీకార చర్యలు ఉండవని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలపై చర్చిస్తామని హామీలు వచ్చినట్లు వాంగ్‌చుక్ వెల్లడించారు. విద్యార్థుల ఉద్యమం మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుందని ఉద్యమ నిర్వాహకులు స్పష్టం చేశారు.