Skip to main content

Telugu News Power

జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ చదలవాడ నాగరాణి.

జల్ జీవన్ మిషన్ సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్

భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతున్న జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి,నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పైపులైన్ పనుల అనంతరం తవ్విన రహదారులను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని సూచించారు. సుమారు రూ.1,400 కోట్ల వ్యయంతో 862 గ్రామాల్లో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ పనులను గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా నీరు, పారిశుధ్య మిషన్ (డి డబ్ల్యూ ఎస్ ఎం ) సమావేశంలో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.