పార్టీలకు అతీతంగా ఒక్కటైన గౌడశెట్టి బలిజ సంఘం.
ఆకివీడు: జూలై,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఆకివీడులో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.
సెంటిని హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గౌడ, శెట్టి బలిజ సంఘం ఆకివీడు వారి సహకారంతో గౌడశెట్టి బలిజ సంఘం కమ్యూనిటీ హాల్లో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. కాగిత కృష్ణ చంద్,ప్రముఖ మెదడు, వెన్నుముక వైద్య నిపుణులు డా. కాగిత రాకేష్ వైద్య సేవలు అందించారు.గుండె ఆరోగ్యం నుంచి మెదడు, వెన్నుముక సమస్యల వరకుప్రజలకు అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గౌడ సంఘ నాయకులు కట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ (రవి) మాట్లాడుతూ, ప్రముఖ వైద్య నిపుణులు ఆకివీడుకు వచ్చి సేవలందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లా వెంకట్రావు మాట్లాడుతూ,
పార్టీలకు అతీతంగా సంఘంలోని నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపైకి రావడం,సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడశెట్టి బలిజ సంఘం జిల్లా నాయకులు, మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ ఆకివీడు టౌన్ అధ్యక్షులు గంధం ఉమామహేశ్వరరావు (ఉమా)తో పాటు వివిధ పార్టీల నాయకులు, సంఘ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా, సేవే లక్ష్యంగా,ఆరోగ్యమే మహాభాగ్యంగా, గౌడశెట్టి బలిజ సంఘం నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజల మన్ననలు అందుకుంది.