Skip to main content

Telugu News Power

వికసిత్ పశ్చిమగోదావరి లక్ష్యంగా కేంద్ర–రాష్ట్ర పథకాలపై సమీక్ష.

20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశం

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లాను విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో వికసిత్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్, లంకా దినకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆక్వా, ఆరోగ్యం, విద్య, అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్య ఘర్ తదితర కేంద్ర పథకాల అమలు, పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ప్రభుత్వ పథకాల లక్ష్యాలను సమయానికి పూర్తి చేసి, పశ్చిమగోదావరిని స్వర్ణాంధ్ర దిశగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వివిధ పథకాల సంబంధించి గణాంకాలతో పధకాల ప్రగతిని వివరించారు.