Skip to main content

Telugu News Power

జిల్లాలో కొత్త పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్ నాగరాణి

పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన గురువారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలకు అనుమతులు, మౌలిక వసతులు, బ్యాంకు రుణాలు ఆలస్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సింగిల్ విండో ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేసి, బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను త్వరగా మంజూరు చేయాలని ఆదేశించారు.