యలమంచిలి:జూలై,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి శుక్రవారం మండలంలో పర్యటిస్తారని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ గురువారం తెలిపారు. ఈ పర్యటనలో మండలంలో గల 11 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, యూపీ పాఠశాలలలో లో ఎంమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ పర్యటనలో సంఘ బాధ్యులు, కార్యకర్తలు ఎక్కువమంది పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఉన్నత పాఠశాలలకు సమీపంలో గల ఉపాధ్యాయులు హైస్కూల్ కు హాజరు కావలసిందిగా
కోరా రు. తేజస్ నగర్ ఆర్చ్ వద్ద నుండి క్యాంపెయిన్ శుక్రవారం ఉదయం గం. 8.30 లకు ప్రారంభం అవుతుంది. దొడ్డిపట్ల హైస్కూల్ 9 గంటలకు చేరుతుంది. అక్కడ హైస్కూల్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుంది. కుంచేరు హైస్కూల్లో సాయంత్రం గం.3:45 లకు చేరుకుని, ప్రచారం ముగుస్తుంది.
నేడు యలమంచిలిలో ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.
ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తి