విశాఖపట్నంభోగాపురం:జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో 13,500 మంది గిరిజన మహిళలు, కళాకారులు ఒకేసారి థింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.
గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన ధింసా నృత్యాన్ని ఒకే వేదికపై భారీ స్థాయిలో ప్రదర్శించడం ద్వారా ఈ అరుదైన రికార్డు నమోదైంది. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే చారిత్రక ఘట్టంగా ఈ కార్యక్రమం నిలిచింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఈ సాంస్కృతిక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ రికార్డు సాధనతో ఆంధ్రప్రదేశ్ గిరిజన కళలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని నిర్వాహకులు, కళాకారులు ఆనందం వ్యక్తం చేశారు.
భోగాపురం విమానాశ్రయంలో థింసా నృత్యానికి ప్రపంచ రికార్డు.
విమానాశ్రయం వద్ద థింసా నృత్య ప్రదర్శన