Skip to main content

Telugu News Power

రాష్ట్ర పండుగగా శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి.

అగ్నికుల క్షత్రియుల ఐక్యత చాటుతున్న నాయకులు

అమరావతి: జులై 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్ని కుల
క్షత్రియులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ పూర్ణమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు చిలకలపూడి పాపారావు స్థానిక తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. చక్కని కురుక్షత్రియ చిరకాల మంచ నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, సహకరించిన మంత్రులు సవిత,కొల్లు రవీంద్ర, అచ్చెమ్ నాయుడు,సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రతి ఏటా ఆగస్టు, 7 న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్లను జీవోలో ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రాజధానిలో అగ్నికుల క్షత్రియుల సామాజిక భావన నిర్మాణానికి 1000 గజాల స్థలం కేటాయించడానికి హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియుల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో గోపీచంద్, జ్ఞానేంద్ర, రామకృష్ణ, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.