పాలకొల్లు: ఆగస్టు, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖలు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా, హైకోర్టు న్యాయవాది, వైయస్సార్ సిపి రాష్ట్ర మహిళా నాయకురాలు, కర్రా జయ సరిత శనివారం నిరసన శిబిరాన్ని సందర్శించారు. ప్రభుత్వ జీవో 396 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల భూహక్కులు ప్రైవేటు రైతుల చేతుల్లో పెట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2002లో కూడా ఇలాంటి జీవో తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఉపాధిని దెబ్బతీసే ఈ జీవో తక్షణం రద్దు చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఇలాంటి జీవోలు తప్ప ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజులేఖర్ల సంఘం అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వరరావు, కడలి శ్రీనివాస్, కృత్తివెంటి రవికాంత్, గోటేటి హనుమంతరావు, శివరామకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న దస్తావేజులేఖర్ల నిరసన.
దస్తావేజులేఖర్లకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న సరిత.