అంబరాన్ని అంటిన మండలి 101వ జయంతి వేడుకలు.
కృష్ణారావు గారికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ , నాయకులు, అభిమానులు.
అవనిగడ్డ: ఆగస్టు, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) శత జయంతి ఏడాది పొడవునా ప్రతిరోజు వేడుకలు జరిగిన అరుదైన ఘనత కృష్ణారావుకే దక్కిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. అవనిగడ్డలో మంగళవారం మండలి వెంకటకృష్ణారావు 101వ జయంతి వేడుకలు అంబరాన్ని అంటే స్థాయిలో ఘనంగా జరిగాయి. అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భారీ గజమాలతో ఘననివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీ, మండలి అభిమానులు, కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. జనసేన నాయకులు అడపా రాంబాబు భారీ గజమాలతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ శత జయంతి వేడుకల్లో కృష్ణారావు అందరివాడిగా, అన్ని పార్టీల నివాళులు అందుకున్నారని తెలిపారు. ప్రప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా దేశ విదేశాల్లో తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చిన కృష్ణారావు సదా స్మరణీయులుగా నిలిచారన్నారు. తెలుగు భాషకు కృష్ణారావు చేసిన సేవకు గుర్తింపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శత జయంతి వేడుకల ప్రారంభంలో కృష్ణారావు పేరును రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘానికి పెట్టి వారి పేరుకు శాశ్వతత్వం చేకూర్చారన్నారు. తాజాగా మండలి కృష్ణారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలల్లో జయంతి వేడుకలు ప్రతిఏటా అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ , మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు సామాన్య విషయం కాదన్నారు. విజయవాడ నడిబొడ్డున కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండటం కృష్ణారావు సేవలకు లభించిన సముచిత గుర్తింపు అన్నారు. ఈ సందర్భంగా మండలి అభిమానులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. విగ్రహం వద్ధ మిఠాయిలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా గాజుల పోతురాజు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా కర్రసాము అసోసియేషన్ అధ్యక్షులు సింహాద్రి పవన్, గ్రామీణ యువజన వికాస సమితి సభ్యులు నున్న వెంకట సుబ్బారావు , మాజీ ఎంపీటీసీ చిలక శ్రీన, దివి శ్రీను తదితరులు కృష్ణారావు చిత్రపటాలను ఎమ్మెల్యే చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు , జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, ఏఎంసీ చైర్మన్లు కొల్లూరి వెంకటేశ్వరరావు, తోట కనకదుర్గ, వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, నడకుదుటి జనార్ధనరావు, మోర్ల రాంబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, టీడీపీ క్లస్టర్ ఇంచార్జి బండే రాఘవ , మాజీ ఎంపీపీలు తుమ్మల వరలక్ష్మి, బండే కనకదుర్గ, మోర్ల జయలక్ష్మి, గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, అడపా రాంబాబు, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, శత జయంతి సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.