పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్.కామ్) కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తలుగా అద్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతమని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బి.ఆర్.ఎం.బి బాలికల పాఠశాల వద్ద గల శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి నిమ్మల ముఖ్యఅతిథిగా ఆదివారం హాజరయ్యారు. మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను నూతన ధర్మకర్తల మండలి పరిరక్షిస్తూ, భక్తులకు దగ్గర కావాలని కోరారు. భవిష్యత్తు తరాలకు హిందూ జీవన విధానం పట్ల అవగాహన కల్పించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ ఆచార వ్యవహారాలను అర్థం చేసుకొని, ప్రతి పండుగ ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రాణం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా, జనసేన నాయకులు, విన్నకోట కృష్ణ బాబు(గోపి), ధర్మకర్తలుగా, కిడాంబి లక్ష్మీ కుమారి, పిల్లా సునీత, పిరాట్ల హేమలత, జామాను వెంకటరమణ, బేతి రెడ్డి మల్లికార్జున రెడ్డి, ముల్లుల జయంతి మాల, ఊటల నరేంద్ర, అశోక్ చే మంత్రి నిమ్మల ప్రమాణ స్వీకారం చేయించి, అభినందనలు తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు, పిచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, బోనం చినబాబు, తులా రామలింగేశ్వర రావు, జక్కంపూడి కుమార్, పినిశెట్టి శ్రీనివాస్, బిట్టా లక్ష్మీనారాయణ, యర్రంశెట్టి పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
సనాతన ధర్మాన్ని ముందు తరాలకు అందించాలి. -మంత్రి నిమ్మల
శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్న మంత్రి నిమ్మల.