Skip to main content

Telugu News Power

పుణ్యక్షేత్రాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి పూజలు.

గోమాతకు పూజలు చేస్తున్న అన్నా కొణిదల

పిఠాపురం: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్)శ్రావణ శుక్రవారాల ప్రారంభం సందర్భంగా, ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ సతీమణి, అన్నా కొణిదల ప్రముఖ దేవాలయాలు సందర్శించుకున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని చారిత్రాత్మక ద్రాక్షారామ శ్రీ మాణిక్యంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రాన్ని, పిఠాపురం నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుక్కుటేశ్వరాలయం లో స్వామివారిని దర్శించుకున్నారు.
అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో తమ కుమారుడు శంకర్ పవనోవిచ్ ప్రమాదంలో గాయపడినప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భుజానికి శాస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ, పూజా కార్యక్రమాలు నిర్వహించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ శుభ సందర్భంలో ఆలయ సంప్రదాయ మర్యాదలతో అర్చకులు, వేద పండితులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు, వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కూటమి నాయకులు,సంపత్ దంపతుల కుమారుడిని, ఆప్యాయ్యంగా చేతుల్లోకి తీసుకొని యక్షిత్ ఓంకార్ గా అన్నా కొణిదెల నామకరణం చేశారు,
ఈ దివ్య దర్శన వేళలో ఆలయ ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులు,పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ స్వయంగా ఈ ఆధ్యాత్మిక పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. శ్రావణ శుక్రవారం కావడంతో పలువురు మహిళలు అన్నా లేజినోవాను కలిసి, పలకరింపు లతో తమ ఆత్మీయ అభిమానాన్ని వ్యక్తం చేసారు. అన్నా కొణిదల హిందూ దేవీ, దేవతల పట్ల చూపుతున్న భక్తిభావానికి, నమ్మకానికి వారు ముగ్గులయ్యారు. శ్రావణ శుక్రవారం పుణ్యక్షేత్రాల్లో అన్నా లెజినోవా పుణ్యక్షేత్రాల అనుగ్రహ దర్శనం చేసుకోవడం తొలి శ్రావణ శుక్రవారం శుభ దినానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్థానిక భక్తులతో ఉపముఖ్యమంత్రి శ్రీమతి