Skip to main content

Telugu News Power

వరలక్ష్మీ వ్రతం పర్వదినం రోజు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, పూజలు.

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి లక్ష గాజుల అలంకరణ
పాలకొల్లు కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

జనరల్ డెస్క్: ఆగస్టు, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వివిధ దేవాలయాల్లో శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే విషయంలో పంచాంగ కర్తలు ఈ ఏడాది, ఈనెల 28న జరుపుకోవడం ప్రశస్తమైనదని సూచించారు. గురు పౌర్ణమితో కలిసి వస్తున్నందున ఆరోజు విశిష్టమైనదని, అమ్మవారికి ఇష్టమైన రోజు అని పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 సెలవు ప్రకటించినదని, మహిళా ఉద్యోగులు, వివిధ కారణాలతో కొందరు మహిళలు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు. పూజా సామాగ్రి ధరలు పెరిగి భక్తులకు భక్తులకు కాస్త ఖర్చు పెంచాయి. యలమంచిలి పుంతల ముసలమ్మ ఆలయంలో అమ్మవారిని 14 లక్షల రూపాయల వివిధ కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులకు అమ్మవారు ధనలక్ష్మి అవతారం లో అనుగ్రహ దర్శనం ఇచ్చారు. పాలకొల్లు, ఎడ్ల బజార్ వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు జరిగాయి. యలమంచిలి మూలస్థానేశ్వరి అమ్మవారిని నవధాన్యాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. భీమవరం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని లక్ష గాజులతో, వినూత్న అలంకరణ లో అనుగ్రహ దర్శనం చేసుకోవటానికి భక్తులు పోటెత్తారు. విశాఖ కనకమహాలక్ష్మి వారు కనకపు కలువల అలంకరణ లో భక్తులకు దర్శనం ఇచ్చారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా, భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు, యువతులు తమ సౌభాగ్యం కోసం, యోగ్యుడైన, మంచి మనసున్న వ్యక్తి భర్తగా కోరుకుంటూ, ప్రతి ఏటా తప్పనిసరిగా వరలక్ష్మి పూజ భక్తిశ్రద్ధలతో ఆచరించటం తెలుగు వారి సాంప్రదాయాల్లో ప్రముఖమైనది. విశిష్ట చరిత్ర ఉన్న పూజల్లో వరలక్ష్మి వ్రతం తప్పకుండా ఉంటుంది.

యలమంచిలి పుంతల ముసలమ్మ తల్లికి రూ. 14 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకరణ
విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారికి బంగారు కలువ పూలతో అలంకరణ