పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం ఉదయం శ్రీ లీలా కళ్యాణమండపం నందు సుమారు వెయ్యి మంది భక్తులకు అరుణాచలం మాతాజీ గాందీమధి, వారి కుమారుడు హరిహరణ్, ప్రకాష్ , భక్తులకు రుద్రాక్షలు అందజేసారు. ఈ కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వాహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, స్థానిక బిజెపి నాయకులు జక్కంపూడి కుమార్, ఆలయ ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, హోత ప్రవాళ, నాళం నాగ వెంకట సురేఖ, బాసిన అప్పల నాగ సత్యనారాయణ, వందరపు కుమారి ఆలయ సూపరింటెండెంట్ వాసు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులకు రుద్రాక్షల పంపిణీ.
లీలా కళ్యాణ మండపంలో రుద్రాక్షల పంపిణీ దృశ్యం