తిరుమల: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమల తిరుపతి దేవస్థానం కు అవసరమైన 50 కంప్యూటర్లను తూర్పుగోదావరి జిల్లా కడియం మండల అధ్యక్షులు అన్నదేవుల చంటి, విజయ పుణ్యదంపతులు స్వామివారికి సమర్పించారు. ఈనెల 4న ఈ కంప్యూటర్ల కొనుగోలుకు అవసరమైన రూ.50 లక్షల చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. అయితే నగదుగా దేవస్థానంకు జమ చేసి మళ్ళీ తిరిగి కంప్యూటర్లు కొనుగోలు చేయడం కంటే నేరుగా కంప్యూటర్ల బహుకరించాలని వారు కోరుతూ చెక్కను వెనక్కి ఇచ్చేసారు. దీంతో లడ్డూ ప్రసాద కౌంటర్లు, ఇతర అవసరాలకు అవసరమైన ఆధునిక 50 కంప్యూటర్లను రూ.60 లక్షలతో కొనుగోలు చేసి సోమవారం ఎఈవో వెంకయ్య చౌదరి కి చంటి అందజేశారు. ఈ సందర్భంగా చంటిని ఏఈఓ ప్రత్యేకంగా అభినందించారు.అలాగే ప్రత్యేక విమానంలో చంటితో పాటు వెళ్లిన ఆయన అనుచరులు పన్నెండు మందికి శ్రీవారి ప్రత్యేక దర్శనం, వసతి సదుపాయం కల్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.60 లక్షల విలువైన కంప్యూటర్ల బహూకరణ. దాత కడియం ఎంపీపీ చంటిని అభినందించిన దేవస్థాన ఏఈఓ.
టీటీడీ దేవస్థానానికి కంప్యూటర్ అందజేస్తున్న కడియం ఎంపీపీ చంటి