Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో కియోస్క్ పరికరాలు ప్రారంభించిన ఎమ్మెలే అంజిబాబు.

కియోస్క్ ఆన్ లైన్ మిషన్స్ ప్రారంభిస్తున్న అంజి బాబు

భీమవరం:ఆగష్టు, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానానికి దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం కరూర్ వైశ్య బ్యాంకు సౌజన్యం తో కియోస్క్ ఆన్ లైన్ మిషన్స్ అందజేశారు. స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఈ పరికరాలుప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గొంతెన రమణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం,పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.