Skip to main content

Telugu News Power

అభివృద్ధి కోసం అంతా కలిసి రావాలి. -మంత్రి నిమ్మల పిలుపు

సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి నిమ్మల
సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు.

పాలకొల్లు: సెప్టెంబర్, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రావాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో శనివారం జరిగిన సమావేశంలో వివిధ శాఖల పనుల పనితీరు, ప్రగతి గురించి మంత్రి సమగ్రంగా, సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను అహోరాత్రులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నప్పటికీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, బృంద ధృత్పథంతో కలిసి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర బొక్కసం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు అండదండలతో, రెండేళ్లలో రూ. 1,172 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించినందుకు, వారికి మేలు చేసే ఉద్దేశంతో ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనుల విషయంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. లక్ష్యాలు నిర్దేశించుకుని, వివిధ దశలో ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. నర్సాపురం ఆర్డీవో దాసిరాజు ఈ సమావేశంలో
మాట్లాడుతూ, దాదాపు 40 ప్రభుత్వ శాఖలు, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు సమీక్షకు హాజరైనట్టు తెలిపారు. జల వనరుల శాఖ ఎస్. ఈ. శ్రీనివాస రావు, డి ఎం అండ్ హెచ్ ఓ భారత లక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్. ఈ. ఉషారాణి, డీఎస్పీ సుధాకర్,
పి డి లు వేణుగోపాల్, హెప్సీ బా, ఆర్ అండ్ బి ఎస్ ఈ విజయరత్నం, కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్తి, పాలకొల్లు డిసి అధ్యక్షులు పెనుమత్స రాంబద్ర రాజు, పట్టణ టిడిపి అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, తులా రామలింగేశ్వర రావు, వల్లభు శ్రీనివాసరావు, మీసాల రామచంద్రరావు, ఎర్రంశెట్టి పద్మారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.