పాలకొల్లు: సెప్టెంబర్,12( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా కళాశాల విద్యార్థులకు పర్యావరణహిత వినాయక ప్రతిమల తయారీ, ప్రదర్శన పోటీని కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలు కలిపిన రంగులతో వినాయక విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తారని, మట్టి, సహజ సిద్దమైన రంగులను పసుపు సేంద్రియ, సహజరంగుల ద్వారా వినాయక విగ్రహాలు పర్యావరణానికి మేలు చేస్తాయన్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంచుటకు,వినాయక చవితి విశిష్టతను తెలుసుకొనుటకు ఈ కార్యక్రమాన్ని తమ కళాశాలలో నిర్వహించాడాని ఎంతో సంతోషిస్తున్నామన్నారు.
కళాశాల యజమాన్యం ఆధ్యాపక సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాలకొల్లు పట్టణ పుర ప్రజలకు 400 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల సెక్రటరీ కెవి సీతారామరాజు మాట్లాడుతూ, భగవంతుడు సహజ సిద్ధ ప్రకృతిని మానవాళికి అందించి, ఆరోగ్యకర జీవితాన్ని ప్రసాదించడానికి ఆ ప్రకృతిని యావత్ మానవాళి రక్షించు కొనవలసిన ఉద్దేశాన్ని విద్యార్థులలో స్ఫూర్తి నింపుటకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.వెంకటేశ్వరావు మాట్లాడుతూ, సర్వమత సామరస్యం కోసం తమ కళాశాలలో జాతీయ పండుగలతో పాటు సంక్రాంతి, వినాయక చవితి, క్రిస్మస్ లాంటి పండుగలు నిర్వహించి విద్యార్థులలో జాతీయ సమైక్యతను, సోదర భావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు లడ్డుల వేలం నిర్వహించుట, మట్టి ప్రతిమల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మెడల్స్ బహుకరించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల, కోశాధికారి ప్రవీణ్ భాను, కళాశాల అకాడమిక్ అడ్వైజర్ ఏబిఎస్ మూర్తి , నందుల సీతారామ రావు, డాక్టర్ కే వరుణ్, అధ్యాపకులు బి. విజయలక్ష్మి, రాధా మాధవి ,రంజని ఎన్.రవికుమార్, రాంబాబు, ఉషా, సంతోష్ ప్రసాద్, రాము, శైలజ, మీనా, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.