Skip to main content

Telugu News Power

యాతం మృతికి పలువురి సంతాపం.

దివంగత నేత యాతం సత్యనారాయణ.
నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు

యలమంచిలి: సెప్టెంబర్ 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాజ తూర్పు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ జడ్పిటిసి సభ్యులు, భూలక్ష్మి భర్త యాతం సత్యనారాయణ(75) బుధవారం రాత్రి మరణించారు. గత కొంత కాలం మీరు అనారోగ్యంతో బాధపడుతున్నాను. వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో కాజ తూర్పు, కాజ పడమర గ్రామాల్లో రాజకీయ చైతన్యం విపరీత స్థాయిలో ఉండేది. ఆ కాలంలో యాతం సత్యనారాయణ సిపిఎం పార్టీలో ఉండేవారు. ఇటుపక్క చాల్లా, అటుపక్క గుబ్బల వారి రాజకీయం చాలా వ్యూహాత్మకంగా ఉండేది. తనను కాంగ్రెస్ పార్టీ వారు అంతమొందించాలని ప్రయత్నించారని శాతం వాపోయేవారు. కత్తిపోట్లకు గురై రోడ్డు మీద వదిలేసిన సందర్భాన్ని గుర్తు చేసుకునేవారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుకైన పాత్ర వహించారు. మండల జడ్పీటీసీగా మహిళల కోటాలో తన భార్యను నిలిపి, గెలిపించుకున్నారు. టిడిపి అప్పటి ప్రముఖ నేతలలో ఒకరైన నేటి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు కు నమ్మినబంటుగా ఉండేవారు. రాజకీయాల్లో వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ బాబ్జికి మద్దతు తెలిపారు. అవసాన దశలో వైసిపి పార్టీలో చేరారు. మృతికి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు తాళ్లూరు సూర్యప్రసాద్, సొసైటీ అధ్యక్షులు పంజా నరసింహారావు, మాజీ ఎంపిటిసి కొప్పిరెడ్డి సర్వేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి బోనం నాని, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని, చుట్టూరి ఆంజనేయులు, కడలి గోపి, చేగొండిడి రవిశంకర్, సూరిబాబు, చేగొండి చిన్ని, డేగల సత్తి కొండ, వలవల ఆంజనేయులు, ఉచ్చుల స్టాలిన్ బాబు, తదితర నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రయాణ సానుభూతి తెలియజేశారు.

కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, దివంగత నేత యాతం సత్యనారాయణకు నివాళులర్పిస్తున్న దృశ్యం