పాలకొల్లు: సెప్టెంబర్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళా సాధికారతకు చంద్రబాబు ఇచ్చిన వరం డోక్రా సంఘాల ఏర్పాటని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో శుక్రవారం యలమంచిలి, పూడూరు క్లస్టర్ డోక్రా మహిళల సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డ్వాక్రా అంటే చంద్రబాబు అనే విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు తెచ్చారని తెలిపారు. మహిళాభివృద్ధికి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులకు బ్రాండింగ్ చేసి, వివిధ ఆన్ లైన్ మార్గాల ద్వారా అమ్మకాలు జరిపించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో 67 డ్వాక్రా సంఘ భవనాల నిర్మాణం చేపట్టి, నిలిచిపోయిన పనులు పునరుద్ధరిస్తున్నటువంటి వెల్లడించారు. ఈ ఆత్మీయ సమావేశంలో డ్వాక్రా సంఘాల వి ఓ ఏ, వి ఓ బీ లు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు, కూటమి నాయకులు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, ఉన్నమట్ల కపర్తి, తులా రామలింగేశ్వర రావు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు చంద్రబాబు ఇచ్చిన వరం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు. .-మంత్రి నిమ్మల
చీరలు పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల