Skip to main content

Telugu News Power

చంద్రబాబు దూరదృష్టి, సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్ సృష్టి.

యువత భవిత కార్యక్రమాలలో సమాధానం ఇస్తున్న మంత్రి నిమ్మల
యువతకు భవిత కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు

ప్రభుత్వ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తా.
యువతకు భవిత కార్యక్రమంలో మంత్రి నిమ్మల హామీ.

పాలకొల్లు: సెప్టెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల సస్యశ్యామల ఆంధ్ర ప్రదేశ్ సృష్టి జరుగుతుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక ఛాంబర్స్ కళాశా లలో శుక్రవారం యువతకు భవిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హంద్రీనీవా, వెలుగొండ, పోలవరం, పట్టిసీమ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా కరువు సీమలకు, అనారోగ్య బాధితులకు సాగునీరు తాగునీరు అందిస్తున్నామన్నారు. సూపర్ ఎల్ నినో వల్ల ఈ ఏడాది 60 శాతం వర్షాలు తక్కువగా ఉన్నప్పటికి, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయటం వల్ల ఎంతో ప్రయోజనం ఉందన్నారు. ఈ సందర్భంగా, విద్యార్థుల సందేహాలకు మంత్రి సమర్థవంతమైన సమాధానాలు ఇచ్చారు. విద్యార్థు లు విలువలతో కూడిన జీవితాన్ని అవచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని ఇచ్చారు. గతంలో జరిగిన డీఎస్సీకి తానే స్వయంగా 2 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేసి, 700 మంది అభ్యర్థులకు తర్ఫీదు ఇప్పించినట్టు తెలిపారు. యువత ప్రణాళిక బద్ధంగా చదివి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. గోదావరి జిల్లా స్థల సమస్య ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు అంతగా అవకాశాలు లేవా ఇప్పటివరకు లేవన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఉప ఉత్పత్తుల తయారీ ద్వారా ఉపాధి ఒక కల్పించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఛాంబర్స్ కాలేజీ అధ్యక్షులు కారుమూరు నరసింహారావు, తట్టువర్తి కృష్ణమూర్తి, కార్యదర్శి కనుమూరి సీతారామరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ దిరిసాల వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మంత్రిని సత్కరించారు.