Skip to main content

Telugu News Power

ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారు దత్తుడు మృతి.

దివంగత పారిశ్రామికవేత్త దత్తుడు

పాలకొల్లు: సెప్టెంబర్,18( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణ ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారు వెంకట మాణిక్యాలరావు
(దత్తుడు)(95) బుధవారం రాత్రి కన్నుమూశారు. పట్టణ పట్టణంలోని ఉన్నత కుటుంబం,ఆర్యవైశ్యులలో ప్రముఖులు, పారిశ్రామిక,వ్యాపార సామ్రాజ్య దిగ్గజం, గుప్త దానకర్ణుడు,కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మహనీయుడు మాణిక్యాలరావు. భావితరాలకు వ్యాపార, వాణిజ్య మార్గదర్శకుడిగా మునుపటి తరం దత్తుడు గురించి చెబుతారు వీరి మరణం వారి కుటుంబానికే కాక ఎందరికో తీరని లోటని ప్రముఖులు నివాళులర్పించారు. వీరి కుమారులు మాణిక్యం ( బాబు) , కృష్ణ బాబు, రాంప్రసాద్, మురళీధర్,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాణిక్యాలరావు భార్య ఇదివరకే మరణించారు. వీరి కోడలు బంగారు ఉషారాణి మున్సిపల్ చైర్ పర్సన్ గా, పాలకొల్లు మొదటి మహిళ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందించారు. దత్తుడు మరణం పట్ల స్థానిక వ్యాపార వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి..