పాలకొల్లు:సెప్టెంబర్,19
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక బిఆర్ఆర్, జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో నైపుణ్య శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఐబీఎం స్కిల్ బేస్డ్, స్కిల్ బిల్డ్ జాబ్ రెడినెస్ శిక్షణా కార్యక్రమం రెండు రోజులపాటు జరిగింది. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఐబీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్, మాస్టర్ ట్రైనర్ రాహుల్ విక్రాంత్ విద్యార్థులకు ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ థియరీటిక్, ప్రాబ్లం సాల్వింగ్ లపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులందరికీ సైబర్ సెక్యూరిటీ పై స్వల్పకాలిక శిక్షణ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసారు. ఐబిఎం స్కిల్ బిల్డ్ జాబ్ రెడినెస్ ప్రోగ్రామ్ కు 467మంది విద్యార్థులను ఆన్ లైన్ కోర్స్ కు నమోదు చేసారు.
దీనితో విద్యార్థి రోజూ 4 గంటల పాటు శిక్షణ ఉంటుంది. ఈ కోర్స్ కాలవ్యవధి మూడు నెలలు. ఇందులో పదివేల మాడ్యూల్స్ ఉంటాయి. ఆన్ లైన్ కోర్సును, భవిష్యత్తులో డిగ్రీ చదువుతోపాటు,ఇంటి నుంచే నేర్చుకోవచ్చని వివరించారు. ఈ ఆన్లైన్ కోర్సులు చేసినవారికి ఐబిఎం స్కిల్ బిల్డ్ జాబ్ రేడినెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో అత్యుత్తమ ఉద్యోగాల కల్పనకు తోడ్పడతాయాన్నారు.
ఈ కార్యక్రమానికి ఏపీ ఎస్ఎస్ డిసి డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి, లోక్ మాన్ మాట్లాడుతూ, విద్యార్థులు సాంకేతికతో పాటు వ్యక్తిత్వ వికాసం, భావవ్యక్తీకరణ పై పట్టు సాధించాలన్నారు.
కళాశాల ప్రిన్సిపల్, డాక్టర్ డి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తమ కళాశాల విద్యార్థులకు టి సి ఎస్, ఐ బి ఎం ,క్యాప్ జెమినీ, విప్రో లాంటి పాన్ ఇండియా కంపెనీలలో కొలువుల సాధనకు ఈ సర్టిఫికేషన్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు తమ లక్ష్యసాధనకు కృషి చేయాలని కోరారు. కళాశాల యాజమాన్యం ఏపీ ఎస్ ఎస్ డి సి ప్రతినిధులు శిక్షణా కార్యక్రమం సర్టిఫికెట్లు విద్యార్థులకు ప్రధానం చేసారు.
ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు, సెక్రెటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్. ప్రవీణ్ భాను,రమేష్, ప్లేస్మెంట్ అధికారులు జానకి రామయ్య టి మీన అధ్యాపకులు ఎన్ రవికుమార్, రాంబాబు, రాము, తదితరులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.