పాలకొల్లు: సెప్టెంబర్, 29
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దగ్గులూరు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం రూ. లక్ష విరాళం అందజేశారు. స్థానిక కాసా వెంకటేశ్వర్రావు తమ తల్లిదండ్రులు, అన్నపూర్ణ, కోట మల్లయ్య జ్ఞాపకార్థం విరాళం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేగేశ్న శ్రీనివాసరాజుకు, పాఠశాల అభివృద్ధి నిమిత్తం సమర్పించారు. ఈ సందర్భంగా దాత కాసా ను మాజీ ఎంపీపీ సామంతపూడి అవతారం రాజు, బిజెపి మండల అధ్యక్షులు వాసా మహేష్,, పాఠశాల కమిటీ సభ్యులు సత్కరించారు.
కాసా వెంకటేశ్వర్రావు పాఠశాలకు రూ. లక్ష విరాళం.
దాత కాసాను సత్కరిస్తున్న దృశ్యం