పాలకొల్లు: సెప్టెంబర్,29
(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఏలు తమ డిమాండ్ల కోసం కొనసాగిస్తున్న నిరసన దీక్షలు మంగళవారానికి 14 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన శిబిరం లో పాల్గొని రోడ్డు మీదే వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. వి ఆర్ ఏ ల మండల అధ్యక్షులు రేపాక నరేష్, ఉపాధ్యక్షులు దాసరి దుర్గ భవాని, కార్యదర్శి బూర్గపు రాజు, కోశాధికారి బుడితి కనకరాజు, సభ్యులు తాడిపత్రి వెంకటేశ్వరరావు, దాకారపు శివకుమార్, నిడదవోలు తాతారావు తదితరులు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
వీఆర్ఏల 14వ రోజు నిరసనలో వంటావార్పు.
వంట-వార్పు తో వి ఆర్ ఏ ల నిరసన