Skip to main content

Telugu News Power

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం. వైద్య పరీక్షలు.

సత్కారం అందుకున్న పారిశుద్ధ్య కార్మికులు

పాలకొల్లు: సెప్టెంబర్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏళ్ళవాని గురువు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను బుధవారం సత్కరించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా 12 మంది పారిశుధ్య కార్మికులను మాజీ సర్పంచ్ దొడ్డా ఏడుకొండలు ఘనంగా సత్కరించారు. వీరికి కూరగాయ లను ఈ సందర్భంగా బహుకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అనితర సాధ్యం అన్నారు. వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతిరోజు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులను మాజీ సర్పంచ్ ప్రశంసించారు. స్థానిక పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో కార్మికులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప మండల అభివృద్ధి అధికారి తాళ్ల మూర్తి బాబు, టిడిపి అధ్యక్షులు పాముల రజిని కుమార్, పంచాయతీ అధికారి సుంకర గాయత్రి, అంబటి శేషగిరి, జక్కంపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.