Skip to main content

Telugu News Power

ఎయిడ్స్ పై నియంత్రణ చర్యలు ముమ్మరం చేయాలి. -కలెక్టర్ నాగరాణి

ఎయిడ్స్ నియంత్రణ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: సెప్టెంబర్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను బుధవారం ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరచుగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌గా గుర్తించిన వారికి వెంటనే చికిత్స అందించాలని సూచించారు.
హెచ్‌ఐవీతో జీవిస్తున్న గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాబోయే 3 నెలల్లో హెచ్‌ఐవీ కేసుల గుర్తింపు, ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.