పాలకొల్లు:అక్టోబర్,4( తెలుగున్యూస్ పవర్. కామ్) పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అభివృద్ధి పనులు పునాదుల దగ్గర నుంచి అధికారులు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పనులను నాణ్యత, గడువు లోపల పూర్తి చేయడానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. టిడ్కో ఇళ్ల సముదయానికి కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. పలుచోట్ల సుందరీకరణ పనులు జరుగు తున్నాయాన్నారు. భవన నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలపటానికి నిరంతరం శ్రమిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలకు అవసర మైన రక్షిత మంచినీరు, విద్యా, వైద్య సౌకర్యాల కల్పనకు నిధులు తెస్తున్నట్టు తెలిపారు తెలిపారు. పట్టణాభివృద్ధికి సంబంధించి హమ్ నిధులు రూ. 44 కోట్లు కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినట్టు వెల్లడించారు. అభివృద్ధి పనులకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్, డి ఈ ఈ కే. రాజకుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు క్షేత్రస్థాయి పరిశీలన. హమ్ నిధులు రూ. 44 కోట్ల పనులకు టెండర్ల పిలుపు. -మంత్రి నిమ్మల వెల్లడి.
అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు ఇస్తున్న మంత్రి నిమ్మల