Skip to main content

Telugu News Power

అభివృద్ధి పనులు వేగం పెంచాలి, నాణ్యత పాటించాలి. క్షేత్రస్థాయిలో పర్యటనలో మంత్రి నిమ్మల ఆదేశాలు.

కుళాయి చెరువు వద్ద పరిశీలిస్తున్న మంత్రి
వర్షంలో గొడుగు వేసుకుని మంత్రి పర్యటన

పాలకొల్లు: అక్టోబర్, 16
(తెలుగు న్యూస్ పవర్.కామ్) అభివృద్ధి పనులు వేగం పెంచి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఏజెన్సీలకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఏజెన్సీలను ఆదేశించారు. పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి క్షేత్రస్థాయి పర్యటనలు పరిశీలించారు. కుళాయి చెరువు, గుండాల వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, 27 వార్డు స్మశాన వాటిక తదితర పనులను ద్విచక్ర వాహనంపై, కూటమి నాయకులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి వారి జీవన ప్రమాణాల పెంచడానికి, ఆహ్లాదకరమైన వాతావరణ కోసం పట్టణంలో వసతులు, సుందరీకరణ పనులు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం కోసం, కార్పొరేట్ స్థాయిలో ముందు పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం, మరో భవనం నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మంత్రి వర్షంలోనే గొడుగు వేసుకుని మాట్లాడారు. ఈ పర్యటనలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి, పెచ్చేట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, పొట్నూరి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.