మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.
యలమంచిలి:ఫిబ్రవరి,25 (తెలుగు న్యూస్ పవర్) కలెక్టర్ చదలవాడ నాగరాణి, బుధవారం మధ్యాహ్నం, స్థానిక మండలం రెవెన్యూ కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేలపై అత్యవసర సమావేశం నిర్వహించారు.ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాసవి పెనుగొండ, పోడూరు, యలమంచిలి తహసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, సమగ్ర కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పి-4 పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం 70 శాతం పూర్తయిన సర్వేను…