గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి – వైద్యుల సూచన
పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వద్ద రోటరీ క్లబ్ అధ్యక్షులు, నిక్షయమిత్ర, డాక్టర్ రామకృష్ణ ఆనందరాజు, గర్భిణీ స్త్రీలకు, క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, అదనపు పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో వారు తప్పక బలవర్ధక ఆహారం తీసుకోవాలని కోరారు. క్షయ వ్యాధి నివారణ ఇప్పుడు ఎంతో సులువని, ముందుతో పాటు బలమైన ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు….