Telugu News Power

ఆకాశ దారులు వెంట గాన కోకిల ఆశ, విషాద హృదయాలతో అభిమానుల వీడ్కోలు.

ఆశ అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు

ముంబై: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రపంచవ్యాప్తంగా ఎందరో సంగీత అభిమానులను తన గందర్వగానంతో అలరించిన గాన కోకిల ఆశాభోంస్లే తన అమృతమయ స్వరఝరిని శ్రోతల హృదయాలలో నిక్షిప్తం చేసి, వారి గుండెల్లో నిండిన విషాదంతో వీడ్కోలు పలకగా, గాన కోకిల ఆశ ఆకాశపుదారులు వెంట తరలి వెళ్ళిపోయారు. ఘనమైనకీర్తి గతానికి వదిలి, వర్తమాన, భవిష్యత్ తరాలకు మూగ వేదన మిగిల్చారు. వివిధ, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఆశాభోంస్లే మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బ్రెట్ లీ ఆమెకు నివాళులులు అర్పించారు. ఆశ అంత్యక్రియలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్, మాజీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, థాకరే కుటుంబ సభ్యులు, వేలాది మంది సినీ తారలు, లక్షల మంది సంగీత అభిమానులు అంతిమయాత్రలో, అంత్యక్రియలు వద్ద ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ముంబై మహానగరంలో సాగిన ఆశ అంతిమయాత్ర సందర్భంగా ప్రజలు బయటకు వచ్చి ఆమెకు నివాళులర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికార లాంచనాలతో ఆశ అంత్యక్రియలు నిర్వహించారు. ఆశాభోంస్లే మరణంతో సినీ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది.

ఆశ అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు
ఆశాకు 21 తుపాకుల వందనం సమర్పిస్తున్న పోలీసులు