Telugu News Power

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపి మూర్తిని గెలిపించాలి. -యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్

ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తిని సభకు పరిచయం చేస్తున్న ప్రసాద్.
గోపి మూర్తికి సంఘీభావం ప్రకటిస్తున్న వివిధ సంఘాల నాయకులు

మరోసారి అవకాశం ఇస్తే మీ గొంతునౌతా.
-ఎమ్మెల్సీ గోపి మూర్తి

భీమవరం; జూన్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజల పక్షాన నిలిచేది పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో జరగనున్న ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తికి యుటిఎఫ్, ఇతర సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎమ్మెల్సీ షేక్ సాబ్లీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో గోపి మూర్తి గెలుపొందారు. యుటిఎఫ్ తమ మద్దతు సంఘాలతో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపి మూర్తిని ప్రకటించింది. ఎమ్మెల్సీ గోపి మూర్తి, పరిచయ సభ స్థానిక శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సభకు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పునరుద్ధరించాక పిడిఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రజల పక్షాన నిలిచి కీలక పాత్ర పోషించారన్నారు. గత 2007 ఎన్నికల్లో పోటీ చేసిన ఏడు స్థానాల్లోనూ పిడిఎఫ్ అభ్యర్థులు గెలిచి చరిత్ర సృష్టించారన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చర్చల ద్వారా ప్రజాక్షేత్రంలో ఉద్యమాల ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. శాసనమండలిలో గోపి మూర్తి ఒక్కరే ఉన్నప్పటికీ మండలిలో మాట్లాడే అవకాశాన్ని వినియోగించుకుని సమస్యలు పరిష్కారానికి తీవ్రమైన కృషి చేశారని చెప్పారు. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు నుంచి వచ్చిన వారు పోటీ చేయాలని ఆలోచనతో ఉన్నారని, వారికి అవకాశం ఇవ్వద్దు అని విజ్ఞప్తి చేశారు. కృష్ణ ,గుంటూరు స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. గతంలో ఇక్కడ ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన వ్యక్తులు పోటీ చేయడంతో ఉపాధ్యాయులకు ఇబ్బంది ఎదురయిందన్నారు. రాయలసీమ ఎన్నికల్లో కూడా గందరగోళం సృష్టించారన్నారు. అర్హులు కాని వారిని ఓటర్లుగా చేర్చే ప్రయత్నాలు తిప్పికొట్టాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో పిడిఎఫ్ ను గెలిపించుకుంటే రాష్ట్రంలో గెలుపు సులువు అవుతుందన్నారు. పిఆర్సి కమిషన్, డిఎ తదితర సమస్యలు పరిష్కరించుకోవడానికి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల గొంతు మండలిలో వినిపించాలంటే ఎమ్మెల్సీ గోపి మూర్తిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపి మూర్తిని సభికులకు అభ్యర్థిగా ప్రసాద్ పరిచయం చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ, ప్రత్యర్ధులు ఎవరైనా గోపి మూర్తి గెలుపే లక్ష్యముగా పనిచేయాలన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీవి రామానుజం మాట్లాడుతూ, గోపి మూర్తి ఉద్యోగ ఉపాధ్యాయ,కార్మిక, కర్షక సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. గోపి మూర్తిని గెలిపించుకోకపోతే ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు . సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ, కష్టజీవుల ప్రతినిధిగా పిడిఎఫ్ నిరంతరం పోరాడుతుందన్నారు. గోదావరి జిల్లాలో పిడిఎఫ్ అభ్యర్థి గెలుపును తిరుగు లేనిదిగా రుజువు చేస్తున్నామని, దానిని కొనసాగించాలన్నారు. సిఐటియు ఎన్నికల కార్యచరణలో భాగమై అభ్యర్థి గోపి మూర్తి గెలుపుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి తవ్వ సురేష్ మాట్లాడుతూ, సమస్యలు పరిష్కారం కావాలంటే పిడిఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, అన్ని రంగాల ప్రజల సమస్యల పరిష్కారంలో సంఘం అనితర సాధ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. శాసనమండలి, లోపల బయట ప్రజా గొంతికను వినిపించడంలో ఎమ్మెల్సీ గోపి మూర్తి చేసిన కృషి ఎనలేనిదన్నారు. రాజకీయ విలువలు కొరవడుతున్న నేటి సమాజ నేపథ్యంలో, పిడిఎఫ్ నీతి, నిజాయితీలతో పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్సీ గోపి మూర్తి లక్ష రూపాయల విలువైన కూపన్ తిరస్కరించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం అన్నారు. రాబోయే ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి , గోపి మూర్తి విజయానికి ఇప్పటి నుంచేకృషి చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతి బాబు మాట్లాడుతూ, ప్రజా గొంతుకను దశదిశలా వినిపిస్తున్న గోపి మూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, దీనికి తమ సంఘాలు పూర్తి మద్దతుగా నిలుస్తాయని ప్రకటించారు. ఏపీ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ కార్యదర్శి అన్నవరం, గోపి మూర్తికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. యుటిఎఫ్ జిల్లా పూర్వ కార్యదర్శిలు ఏ కెవి రామభద్రం , మార్కండేయులు, పి సీతారామరాజు , ఆడిట్ కమిటీ కన్వీనర్ పి శ్రీనివాసరాజు , జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్ , పెన్షనర్స్ నాయకులు సీతారామరాజు మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి జి మురళీధర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామలక్ష్మణరావు , మల్లుల శ్రీనివాస్ , యుటిఎఫ్ ఏలూరు జిల్లా కార్యదర్శి కె కమల్ కుమార్ , నాయకులు కట్ట వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఎంఈఓ రామకృష్ణ, యుటిఎఫ్ నాయకులు ,కార్యకర్తలు, ఉపాధ్యాయులు , ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. తనను పరిచయం చేసినందుకు, కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ,
శాసన మండలిలో ప్రజల గొంతు వినిపించేందుకు మరోసారి అవకాశం కల్పించాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. తాను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో 110 మండలాలు, 14 మున్సిపాల్టీలు, మూడు కార్పొరేషన్లలో పర్యటించి అక్కడి పాఠశాలల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, సామాన్య ప్రజానీకం సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానన్నారు. సమస్యలపై శాసనమండలిలో గొంతు వినిపించడమే కాకుండా, మండలి బయట కూడా సమస్యలపై పని చేశానని తెలిపారు. ముఖ్యంగా ఎనిమిది గంటల పని విధానం రద్దు, 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగాశాసనమండలిలో తన వాణి వినిపిపించానని చెప్పారు. పి-4 విధానంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకునేలా పోరాడ మన్నారు.పోలవరం నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అందించాలని మండలిలో ప్రస్తావించానని తెలిపారు. 70 శాతం మంది ఉన్న కౌవులు రైతులకు అన్నదాత సుఖీభవ అందించాలని ప్రస్తావించానన్నారు. ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిపించానన్నారు.పిడిఎఫ్
ఎమ్మెల్సీ 14 మంది 25 సార్లు గెలుపొందారంటే అది పిడిఎఫ్ గొప్పతనమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేవలం 40 రోజుల్లో 3906 మొదటి ప్రాధాన్యత ఓటుతో భారీ మెజారిటీతో గెలుపొందానంటే అది అందరి సహాయ, సహకారాలతో మాత్రమే సాధ్యమైందన్నారు. తన 16 నెలల ఎమ్మెల్సీ పదవి ద్వారా వచ్చిన జీతాన్ని ఒక్క రూపాయి కూడా కుటుంబానికి, వ్యక్తిగతానికి వినియోగించుకోలేదని వెల్లడించారు. తనకు వచ్చిన రూ. 7 లక్షల మెచ్యూరిటీ ఫండ్ ను కూడా ఉద్యమాలకే ఖర్చు చేశానని తెలిపారు. బాధ్యత, నిజాయితీ, నిబద్దతతో పని చేస్తున్నానని పేర్కొనన్నారు. వచ్చే 2027 ఎన్నికలో ఎమ్మెల్సీగా మరోసారి పోటీ చేసే అవకాశం లభించిందని, పూర్తి కాలం అవకాశం కల్పిస్తే అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, పిడిఎఫ్ పక్షాన ఉద్యమ నాయకునిగా ప్రజాగొంతును మండలిలో వినిపిస్తానని హామీ ఇచ్చారు.