యలమంచిలి: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులు బొర్రా గోపి మూర్తి తన స్వగ్రామం మట్లపాలెంలోని గమల్లపేటలో పలు కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. భారత రక్షణ దినం ఇన్స్పెక్టర్గా 39 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ చేసిన బుంగరాజు దంపతులను గోపి మూర్తి సత్కరించారు. ఇటీవల ఐఐటీలో సీటు సంపాదించన దీపాటి ప్రదీప్, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికోసం సాయం చేస్తున్న గడ్డం సునీల్ గవాస్కర్ ను ఎమ్మెల్సీ సత్కరించారు. గత 19 ఏళ్లగా స్థానిక విద్యార్థులకు సుమారు 25వేల రూపాయల విలువైన విద్యాసామాగ్రి ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తిరుమల రాజు, వలవల విష్ణు బాలాజీ,యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్, మండల శాఖ అధ్యక్షులు గుత్తుదీవిం శ్రీనివాస్, పంతం రామ్మూర్తి నాయుడు, బుంగ జెస్సి కళ, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
